గుజ‌రాత్ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా అమిత్ షా?.. రూమ‌ర్ నిజ‌మేనా? అంటూ ఆప్ ట్వీట్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుజ‌రాత్ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా అమిత్ షా?.. రూమ‌ర్ నిజ‌మేనా? అంటూ ఆప్ ట్వీట్‌!

aap satires on bjp over gujarat assembly polls
  • గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మీపిస్తున్న గ‌డువు
  • రాష్ట్రంలో తాము వృద్ధి చెందుతున్నామ‌న్న ఆప్‌
  • త‌మ‌ను ఎలా అడ్డుకోవాలో తెలియ‌క బీజేపీ అయోమ‌యానికి గుర‌వుతోంద‌ని సెటైర్‌
గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌.. ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ సెటైర్ సంధించింది. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా కేంద్ర హోం శాఖ మంత్రిని ఖ‌రారు చేసిన‌ట్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ‌న్న ఆప్‌... ఈ వార్త నిజ‌మేనా? అంటూ త‌న ట్వీట్‌లో బీజేపీని ప్ర‌శ్నించింది. 

ప్రస్తుతం గుజ‌రాత్ సీఎంగా కొన‌సాగుతున్న భూపేంద్ర ప‌టేల్ నాయ‌క‌త్వంపై బీజేపీ అసంతృప్తిగా ఉంద‌ని తెలుస్తోంద‌ని, ఈ మాట కూడా నిజ‌మేనా? అంటూ భూపేంద్ర‌ను ప్ర‌శ్నించింది. మ‌రో అడుగు ముందుకేసిన ఆప్‌...గుజ‌రాత్‌లో నానాటికీ బ‌లోపేత‌మ‌వుతున్న త‌మ‌ను చూసి భ‌య‌ప‌డుతోంద‌ని కూడా వ్యాఖ్యానించింది. మొత్తంగా త‌మ‌ దిన‌దినాభివృద్ధిని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక బీజేపీ త‌ల ప‌ట్టుకుంద‌ని ఆప్ కామెంట్ చేసింది.
AAP
BJP
Gujarat
Amit Shah
Assembly Polls

More Telugu News