రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్

Telugu film shootings will be halted from tomorrow
  • కొన్నిరోజుల క్రితమే ప్రకటించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్
  • గిల్డ్ నిర్ణయానికి ఫిలిం చాంబర్ మద్దతు
  • చిన్నా, పెద్ద నిర్మాతలంతా ఒక్కతాటిపైకి వచ్చారన్న దిల్ రాజు
  • షూటింగులు ఎప్పుడు ప్రారంభమయ్యేది త్వరలో చెబుతామని వెల్లడి
ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించినట్టుగా రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయానికి ఫిలిం చాంబర్ మద్దతు తెలిపింది. ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ చిత్రాల షూటింగ్ లు నిలిపివేస్తున్నట్టు ఫిలిం చాంబర్ ప్రకటించింది. అధిక నిర్మాణ వ్యయం భరించలేకపోతున్నామని కొంతకాలంగా నిర్మాతలు వాపోతున్నారు. 

షూటింగుల నిలిపివేతపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. చిన్న, పెద్ద నిర్మాతలంతా ఒక్కతాటిపైకి వచ్చారని వెల్లడించారు. మళ్లీ షూటింగ్స్ ఎప్పటి నుంచి ప్రారంభించేది త్వరలోనే చెబుతామని పేర్కొన్నారు. 24 క్రాఫ్ట్స్ తో మాట్లాడి నిర్ణయం వెలువరిస్తామని తెలిపారు.
Go Back to Shorts
Shootings
Tollywood
Producers Guild
Dil Raju

More Telugu News