Mahesh Babu: మహేశ్ బాబు ద్విపాత్రాభినయమే హాట్ టాపిక్!

Trivikram and Mahesh Babu movie update
షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చురుకుగా జరుగుతున్నాయి. వచ్చేనెల 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పైనే ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడనే వార్త షికారు చేసింది. అది నిజమేననే టాక్ ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. ఈ రెండు పాత్రలను త్రివిక్రమ్ డిజైన్ చేసిన తీరు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ తో ఫస్టు షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. 

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న 3వ సినిమా కావడంతో అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు. ఈ  సినిమాలో ఒక కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. రెండవ కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'సంక్రాంతి'కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో  ఉన్నారు.
Go Back to Shorts
Mahesh Babu
Pooja Hegde
Priyanka Arul Mohan
Trivikram SrinivasMovie

More Telugu News