Rohit Sharma: ఇంగ్లండ్‌లోనే హిట్ మ్యాన్‌!... ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్న రోహిత్‌!

rohit sharma enjoys with family in england
షార్ట్స్‌లో చూడండి
వ‌రుస విజ‌యాల‌తో స‌త్తా చాటుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌... ఇంగ్లండ్‌లో జ‌ట్టు ప‌ర్య‌ట‌న ముగిసినా ఆ దేశంలోనే ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ జ‌ట్టుతో ఐదో టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్‌... టీ20, వ‌న్డే సిరీస్‌ జ‌ట్టుల‌కు నాయ‌కత్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓట‌మిపాలు కాగా... రోహిత్ శ‌ర్మ నేతృత్వంలో టీ20 సిరీస్‌తో పాటు వ‌న్డే సిరీస్‌ను కూడా గెలిచింది.

త్వ‌ర‌లోనే వెస్టిండిస్ ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా బ‌య‌లుదేరాల్సి ఉంది. ఈ నెల 22 నుంచి విండిస్ జ‌ట్టుతో వ‌న్డే సిరీస్ మొద‌లు కానుంది. అయితే రెండు రోజుల క్రితం ఇంగ్లండ్‌తో జ‌రిగిన చివ‌రి వ‌న్డేలో జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించిన రోహిత్‌... మ్యాచ్‌ను ఒడిసిప‌ట్టేశాడు. వెర‌సి టీమిండియాకు మ‌రో సిరీస్ విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత భార్య‌, కూతురుతో క‌లిసి రోహిత్ ఇంగ్లండ్‌లో వివిధ ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా డ‌ప్లో వ్యాలీలో ఫ్యామిలీతో క‌లిసి దిగిన రోహిత్ శ‌ర్మ ఫొటో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
Go Back to Shorts
Rohit Sharma
Team India
England
Cricket

More Telugu News