వైద్యరంగంలో సంచలనం.. ఎయిడ్స్‌కు వ్యాక్సిన్ కనుగొన్న ఇజ్రాయెల్ పరిశోధకులు
- వైద్య రంగంలోనే పెద్ద పురోగతి అంటున్న నిపుణులు
- ఒకే ఒక్క టీకాతో వైరస్‌ను న్యూట్రలైజ్ చేసిన పరిశోధకులు
- రోగ నిరోధకశక్తిని తిరిగి యాక్టివ్‌గా మార్చిన టీకా
- 1981లో మానవుల్లో కనిపించిన ఎయిడ్స్
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనికి సరైన చికిత్స కనుక తీసుకోకపోతే అది అక్వైర్డ్ ఇమ్యునో డిఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS)కి దారి తీస్తుంది. టెల్ అవీవ్ యూనివర్సిటీలోని ది జార్జ్ ఎస్ వైజ్ ఫ్యాకల్టీ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని స్కూల్ ఆఫ్ న్యూరోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్ పరిశోధకుల బృందం దీనిపై పరిశోధన నిర్వహించింది. టైప్- బి తెల్ల రక్త కణాల ద్వారా అభివృద్ధి చేసిన ఒకే టీకాతో వైరస్‌ను న్యూట్రలైజ్ చేయడంలో పరిశోధకులు విజయం సాధించారు. హెఐవీని న్యూట్రలైజ్ చేసే ప్రతిరోధకాలను ఈ టీకా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థను తిరిగి యాక్టివ్‌గా మారుస్తుంది.
పరిశోధనలో భాగంగా చికిత్స తీసుకున్న కొందరి రక్తంలో కావాల్సినన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. ఈ పరిశోధన విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఎయిడ్స్‌కు మందులు కూడా ఉత్పత్తి చేస్తామని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. తాము చికిత్స అందించిన అన్ని ల్యాబ్ మోడళ్లు బాగా ప్రతిస్పందించాయని, వారి రక్తంలో కావాల్సిన యాంటీబాడీని అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయగలిగామని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ బార్జెల్ వివరించారు.