స్థ‌ల వివాదంలో కోర్టు విచార‌ణ‌కు హాజ‌రైన సినీ న‌టుడు రానా

actor rana daggubati attends city civil court hearing
  • ఫిల్మ్ న‌గ‌ర్ స్థ‌లం రానా పేరిట‌ రిజిస్ట‌ర్ అయిన వైనం
  • ఈ స్థ‌ల‌ వివాదంలోనే రానాకు కోర్టు నోటీసులు
  • విచార‌ణ‌ను ఈ నెల 14కి వాయిదా వేసిన కోర్టు
టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు ద‌గ్గుబాటి రానా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. ఓ స్థ‌లానికి సంబంధించి దాఖలైన పిటిష‌న్‌లో గ‌తంలో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల మేర‌కు మంగ‌ళ‌వారం రానా కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. ఈ వ్య‌వ‌హారంపై త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.

ఈ వివాదం వివ‌రాల్లోకెళితే... హైద‌రాబాద్‌లోని ఫిల్మ్ న‌గ‌ర్ ప‌రిధిలో ఓ స్థ‌లాన్ని 2014లో ఓ సంస్థ లీజుకు తీసుకుంది. అయితే సదరు సంస్థ య‌జ‌మాని కుమారుడు ఆ స్థలాన్ని ద‌గ్గుబాటి రానా పేరిట రిజిస్ట‌ర్ చేసిన‌ట్లుగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.
Go Back to Shorts
Tollywood
Rana Daggubati
City Civil Court
Hyderabad
Film Nagar

More Telugu News