టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన ధోనీ..ఎందుకంటే!

MS Dhoni visits Team india dressing room
  • భారత్, ఇంగ్లండ్ రెండో టీ20కి హాజరైన మహీ
  • యువ ఆటగాళ్లతో ముచ్చటించిన ధోనీ
  • బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ మళ్లీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కి వచ్చాడు. తనతో కలిసి ఆడిన ఆటగాళ్లతో ముచ్చటించాడు. కుర్రాళ్లకు విలువైన సూచనలు చేశాడు. టీ20 లో ప్రపంచకప్  భారత జట్టుకు మెంటార్ గా వ్యవహరించిన ధోనీ మరోసారి ఆ పాత్రలో కనిపించబోతున్నాడా? అనే అనుమానం కలుగుతోంది కదా!. మహీ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చింది మెంటార్ గా కాదు.. అతిథిగా. 

తన పెళ్లి రోజు, పుట్టిన రోజు వేడుకల కోసం ధోనీ వారం కిందటే లండన్ పర్యటనకు వెళ్లాడు. ఈ సందర్భంగా శనివారం రాత్రి బర్మింగ్ హోమ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చిన మహీ సందడి చేశాడు. ఆటగాళ్లందరితో ముచ్చటించాడు. 

యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, జట్టు సహాయక సిబ్బందితో మాట్లాడుతున్న ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేశాడు. గ్రేట్ ధోనీ మాట్లాడుతుంటే వినేందుకు అందరూ సిద్ధమే అని క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే, స్టేడియంలో రిషబ్ పంత్ తో కూడా ధోనీ ఫొటో దిగాడు. ఇవన్నీ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
Go Back to Shorts
Team India
MS Dhoni
dressing room
ishan kishan
rishabh pant
chahal

More Telugu News