మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 16,159 కరోనా కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 28 మంది మృతి
- 1,15,212కి పెరిగిన యాక్టివ్ కేసులు
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,35,47,809కి పెరిగింది. వీరిలో 4,29,07,327 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,270 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.53 శాతంగా, పాజిటివిటీ రేటు 3.56 శాతంగా, మరణాలు రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.26 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 198.20 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.