ఇండియా కరోనా అప్డేట్స్.. స్వల్పంగా తగ్గిన కేసులు
- గత 24 గంటల్లో 13,086 కేసుల నమోదు
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,864
- 98.53 శాతంగా ఉన్న రికవరీ రేటు
ఇక ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 5,25,223కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.26 శాతంగా, రికవరీ రేటు 98.53 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, పాజిటివిటీ రేటు 2.90 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,97,98,21,197 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 1,78,383 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.