ప్రభాస్ హోమ్ బ్యానర్ లో సూర్య మూవీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ హోమ్ బ్యానర్ లో సూర్య మూవీ!

Surya in Shiva Movie
  • భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా యూవీకి పేరు 
  • చిన్న సినిమాలపై కూడా దృష్టి పెట్టిన సంస్థ
  • కోలీవుడ్ స్టార్స్ తోను సినిమాలు 
  • శివ - సూర్య కాంబో సెట్స్ పైకి
యూవీ క్రియేషన్స్ ప్రభాస్ హోమ్ బ్యానర్ అనే విషయం తెలిసిందే. ఈ బ్యానర్ పై ప్రభాస్ తో భారీ సినిమాలు నిర్మిస్తూనే, మరో వైపున ఓ మాదిరి బడ్జెట్  సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. అంతే కాకుండా గీతా ఆర్ట్స్ 2 తో కలిసి చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇలా యూవీ బ్యానర్ నుంచి వరుస ప్రాజెక్టులు పట్టాలెక్కుతూనే ఉన్నాయి. 

ఇక ఈ బ్యానర్ నుంచి ద్విభాషా చిత్రాలను కూడా నిర్మించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ .. ధనుష్ .. శివకార్తికేయన్ హీరోలుగా తెలుగు ..  తమిళ భాషల్లో సినిమాలు నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. అలా సూర్య హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో ఒక సినిమాను నిర్మించడానికి యూవీ వారు రంగంలోకి దిగినట్టుగా సమాచారం. 

ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. హీరో అజిత్ కి వరుసగా భారీ హిట్లు ఇచ్చిన శివ , ఇటీవల రజనీకాంత్ కి మాత్రం 'పెద్దన్న'తో హిట్ ఇవ్వలేకపోయాడు. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతోంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Surya
Prabhas
Tollywood

More Telugu News