ఎట్టకేలకు ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీని విడదీసిన బుమ్రా

Bumrah breaks England opening partnership
బర్మింగ్ హామ్ టెస్టులో ఇంగ్లండ్ టార్గెట్ 378 పరుగులు కాగా, ఆతిథ్య జట్టు ఓపెనర్లు టీమిండియా శిబిరాన్ని ఆందోళనకు గురిచేశారు. వన్డే తరహాలో ఆడిన అలెక్స్ లీస్, జాక్ క్రాలే జోడీ తొలి వికెట్ కు 107 పరుగులు జోడించి టీమిండియాను హడలెత్తించింది. అయితే, ఈ జోడీని టీమిండియా సారథి బుమ్రా విడదీశాడు. 46 పరుగులు చేసిన క్రాలేని ఓ అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు. మరో ఎండ్ లో అలెక్స్ లీస్ 56 పరుగులతో ఆడుతుండగా, ఓల్లీ పోప్ క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్ విజయానికి మరో 271 పరుగుల దూరంలో ఉంది. 

ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 284 పరుగులు సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 245 పరుగులకు ఆలౌట్ కావడం తెలిసిందే.
Go Back to Shorts
Bumrah
Crawley
Team India
England
Edgbaston
Birmingham

More Telugu News