ఒకే రోజు 14 వేలు దాటిన కరోనా కేసులు.. లక్షకు చేరుకున్న యాక్టివ్ కేసులు!
- గత 24 గంటల్లో 14,506 పాజిటివ్ కేసులు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 11,574
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,602
తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,34,33,345కి పెరిగింది. వీరిలో 4,28,08,666 మంది కోలుకోగా.. 5,25,077 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3.38 శాతంగా, రికవరీ రేటు 98.56 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.23 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 197.46 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 13,44,788 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.