రఘురామకృష్ణరాజును డిబేట్లకు అనుమతించొద్దు: 'సంసద్' టీవీకి విజయసాయిరెడ్డి లేఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రఘురామకృష్ణరాజును డిబేట్లకు అనుమతించొద్దు: 'సంసద్' టీవీకి విజయసాయిరెడ్డి లేఖ

Vijayasai Reddy writes letter to Sansad TV asking not to allow Raghu Rama Krishna Raju to debates
  • సంసద్ టీవీ సీఈవోకు విజయసాయి లేఖ
  • వైసీపీకి, ప్రభుత్వానికి ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదన్న విజయసాయి
  • ఆయనపై అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉందని వ్యాఖ్య
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును పొలిటికల్ డిబేట్లకు అనుమతించవద్దని సంసద్ (పార్లమెంటు) టీవీ సీఈవోకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రఘురామకృష్ణరాజు ఏపీ ప్రభుత్వానికి కానీ, వైపీసీకి కానీ ప్రాతినిధ్యం వహించడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆయన లోక్ సభ అభ్యర్థిత్వంపై అనర్హత పిటిషన్ స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉందని చెప్పారు. ఈ లోక్ సభ కాలపరిమితి ముగిసేంత వరకు ఆయనను టీవీ చర్చల్లో భాగస్వామిని చేయవద్దని కోరారు. 

మరోవైపు దీనిపై రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు. పార్టీ నుంచి తనను బహిష్కరించకుండా... టీవీ చర్చలకు అనుమతించవద్దని ఎవరూ లేఖలు రాయలేరని చెప్పారు. చేతనైతే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్ విసిరారు.
Vijayasai Reddy
Raghu Rama Krishna Raju
YSRCP
Sansad TV

More Telugu News