దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు... ఎలా చనిపోయారన్నది మిస్టరీ!
- ఈస్ట్ లండన్ సిటీలో ఘటన
- ఆదివారం వేకువ జామున ఘటన
- మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేని వైనం
- కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు
పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. దీనిపై ఓ పోలీసు అధికారి స్పందిస్తూ, తాము పుకార్లను నమ్మదలుచుకోలేదని, ఇంతమంది ఎలా మరణించారన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కాగా, మృతదేహాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయితే వారి మరణానికి నిర్దిష్ట కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.