Space: ఆకాశంలో ఐదు గ్రహాల అరుదైన కలయిక.. 158 ఏళ్ల తర్వాత ఇప్పుడే..

The best ever view of an epic 5 planet alignment is happening this week
షార్ట్స్‌లో చూడండి
సౌర కుటుంబంలో భూమి సహా ఎనిమిది గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. అందులో ఐదు గ్రహాలు ఒక వరుసలో కనిపించే అరుదైన ఘట్టానికి ఈ నెల వేదిక అవుతోంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకదాని వెనుక మరొకటిగా కనువిందు చేయనున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచే ఈ వరుస క్రమం ప్రారంభమైందని.. 26, 27 తేదీల్లో అద్భుతంగా కనిపిస్తుందని అంతరిక్ష నిపుణులు చెప్తున్నారు. ఈ రోజుల్లో తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు తూర్పు దిశ నుంచి నైరుతి దిశ వరకు వరుసగా ఈ గ్రహాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు. అయితే భూమిపై వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లో కాస్త ముందూ, తర్వాతా ఈ దృశ్యం కనిపిస్తుందని చెప్తున్నారు.

అదే వరుసలో రావడం అత్యంత అరుదు
గ్రహాలు అరుదుగా ఎప్పుడో ఓసారి మాత్రమే ఒక వరుసలోకి వస్తుంటాయి. అందులోనూ వేర్వేరు దూరాలు, వేర్వేరు వేగంతో సూర్యుడి చుట్టూ తిరుగుతుండటంతో.. అవి ఉన్న వరుస క్రమంలో కనబడటం అత్యంత అరుదుగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అందులోనూ రెండు, మూడు గ్రహాలు వరుసగా వస్తుంటాయని.. కానీ ఐదు గ్రహాలు వరుస క్రమంలోకి రావడం చివరిసారిగా 1864వ సంవత్సరంలో కనిపించిందని చెప్పారు. ఇప్పుడు 158 ఏళ్ల తర్వాత ఆ దృశ్యం కనిపించనుందని తెలిపారు.
  • ఈ ఐదు గ్రహాలకు తోడు ఈ నెల 23, 24, 25 తేదీల్లో చందమామ కూడా వరుసలోకి వచ్చి కనువిందు చేస్తుందని వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల పాటు కూడా కాస్త దూరంగా ఈ కలయిక కనిపిస్తుందని.. తర్వాత గ్రహాలు దూరదూరంగా వెళ్లిపోతాయని తెలిపారు.

ఎలా కనిపిస్తాయి?
సూర్యుడి చుట్టూ గ్రహాలే అయినా.. వాటిపై సూర్య కాంతి పడి ప్రతిఫలించే క్రమంలో అవి మనకు ఆకాశంలో చుక్కల్లా కనిపిస్తాయి. ప్రఖ్యాత ‘స్పేస్’ అంతరిక్ష వెబ్సైట్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఏ గ్రహం ఎలా కనిపిస్తుందో చూద్దామా..
  • ఆకాశంలో తూర్పు–ఈశాన్య ప్రాంతంలో దిగువగా బుధ గ్రహం ఉంటుంది. అది కాస్త తక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
  • దాదాపు తూర్పు దిశలో ప్రకాశవంతంగా మిణుకు మిణుకు మంటూ శుక్రుడు కనిపిస్తాడు.
  • తూర్పు–ఆగ్నేయ దిశలో కాస్త ఎగువన అంగారక గ్రహం ఉంటుంది.
  • దాదాపు ఆగ్నేయ దిశలో మరికాస్త ఎగువన బృహస్పతి (జూపిటర్) ప్రకాశవంతగా కనిపిస్తుంది.
  • దక్షిణ దిశలో బృహస్పతికి కాస్త దిగువన శని గ్రహం కనిపిస్తుంది.
  • ఈ నెల 23, 24, 25 తేదీల్లో వీటన్నింటి పక్కన చందమామ కూడా చేరుతుంది.
  • మొత్తంగా ఐదు గ్రహాలు, చందమామ ఒక విల్లులా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
  • తర్వాతి సారి ఐదు గ్రహాల కలయిక త్వరలోనే రానుందని.. ఈసారి 2040లో ఇవే తీరులో గ్రహాల కలయిక ఏర్పడనుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
Go Back to Shorts
Space
Five planets
Planets
Planets alignment
june
Mars
Venus
Mercury
Jupiter
Saturn

More Telugu News