దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India reports 13313 Corona fresh cases
  • గత 24 గంటల్లో 13,313 కేసుల నమోదు
  • దేశంలో 83,990కి పెరిగిన యాక్టివ్ కేసులు
  • ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,941
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 13,313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 12,249 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో 10,972 మంది కరోనా నుంచి కోలుకోగా... 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,44,958కి పెరిగింది. వీరిలో 4,27,36,027 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,941 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.60 శాతంగా, పాజిటివిటీ రేటు 2.03 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,96,62,11,973 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 14,91,941 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News