తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు... వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 26,704 కరోనా పరీక్షలు
- 403 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 240 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 145 మంది
- ఇంకా 2,375 మందికి చికిత్స
అదే సమయంలో 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,96,704 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,90,218 మంది కోలుకున్నారు. ఇంకా 2,375 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
