తెలంగాణలో తాజాగా 279 మందికి కరోనా
- గత 24 గంటల్లో 27,841 కరోనా పరీక్షలు
- మరోసారి 250కి పైగా కొత్త కేసులు
- హైదరాబాదులో 172 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 119 మంది
- ఇంకా 1,781 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 7,95,572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,89,680 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,781 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
