వరుసగా రెండో రోజు 12 వేలకు పైగా కేసులు.. 63 వేలు దాటిన యాక్టివ్ కేసులు!
- గత 24 గంటల్లో 12,847 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,985
- 63,063కి పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
ఇదే సమయంలో కరోనా నుంచి 7,985 మంది కోలుకోగా... 14 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,063కి పెరిగింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5,24,817 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 1,95,84,03,471 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 15.27 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.