హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన... అధికారులను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ
- తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
- ఫలితంగా సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
- రానున్న 2, 3 రోజుల్లో నగరంలో భారీ వర్షాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక
- ప్రజలు, అధికారులను అప్రమత్తం చేస్తూ జీహెచ్ఎంసీ ప్రకటన
వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అప్రమత్తమైంది. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తతతో వ్యవహరించాలని కూడా సూచించింది.