Rashmika Mandanna: అభిమానిని ఆపిన సెక్యూరిటీ గార్డుపై కసురుకున్న రష్మిక

Rashmika Mandanna angry on security guard
షార్ట్స్‌లో చూడండి
ఎప్పుడూ ఎంతో కూల్ గా కనిపించే టాలీవుడ్ ముద్దుగుమ్మ రష్మిక మందన్నకు కోపం వచ్చింది. తన సెక్యూరిటీ గార్డుపై ఫైర్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే... ఓ షూటింగ్ సందర్భంగా సెట్ నుంచి తన కారవాన్ లోకి రష్మిక వెళ్తుండగా... అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఒకరితర్వాత మరొకరు ఆమెతో సెల్ఫీలు దిగుతున్నారు. ఈ సందర్భంగా ఒక అభిమానిని సెక్యూరిటీ ఆపేశాడు. వెనక్కి వెళ్లిపోవాలని చెప్పాడు. దీంతో, సెక్యూరిటీ గార్డుపై రష్మిక కసురుకుంది. అతన్ని పంపించాలని చెప్పింది. ఆ తర్వాత సదరు అభిమానితో సెల్ఫీ దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Go Back to Shorts
Rashmika Mandanna
Tollywood
Hollywood

More Telugu News