దేశంలో తగ్గిన కరోనా కేసులు.. 50 వేలు దాటిన యాక్టివ్ కేసులు!
- గత 24 గంటల్లో కొత్తగా 6,594 కేసుల నమోదు
- నిన్నటితో పోలిస్తే 18 శాతం తగ్గిన కేసులు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,035
దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా, క్రియాశీలత రేటు 0.12 శాతంగా, పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా కొత్త కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు 195 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. మరోవైపు, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ మాట్లాడుతూ... కరోనా ఇంకా అంతం కాలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.