Samantha: కేటీఆర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కు లైక్ కొట్టిన సమంత

 Actress Samantha likes KTRs Instagram post
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత ఇప్పుడు బాలీవుడ్ లో సైతం దూసుకుపోతోంది. వరుస ఆఫర్లతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యేందుకు యత్నిస్తోంది. మోస్ట్ పాప్యులర్ పాన్ ఇండియా హీరోయిన్ గా ఓ సర్వేలో సమంత టాప్ పొజిషన్ లో నిలిచిందంటే ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సమంత మరోసారి హెడ్ లైన్స్ లో నిలిచింది. 

ఇన్స్టాగ్రామ్ లో కేటీఆర్ చేసిన ఒక పోస్ట్ కు ఆమె లైక్ కొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ ఈ పోస్ట్ చేశారు. ఇన్స్టాలో కేటీఆర్ చేసిన పోస్ట్ ఏమిటంటే... 'దేశ జనాభాలో కేవలం 2.5 శాతం జనాభా మాత్రమే ఉండే తెలంగాణ... దేశ జీడీపీలో 5 శాతాన్ని అందిస్తోంది. (సోర్స్: ఆర్బీఐ రిపోర్ట్ అక్టోబర్ 2021). ఈ దేశానికి కావాల్సింది డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాదు. డబుల్ ఫలితాలను ఇచ్చే పాలన' అని ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు సమంత లైక్ కొట్టింది. తెలంగాణ చేనేతకు సమంత బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Samantha
Tollywood
Bollywood
KTR
TRS

More Telugu News