'జిన్నా' పేరుతో మంచు విష్ణు సినిమా... టైటిల్ పై బీజేపీ అభ్యంతరం

Controversy looms on Manchu Vishnu new movie
  • వివాదంలో మంచు విష్ణు చిత్రం
  • ఇటీవల జిన్నా టైటిల్ ప్రకటన
  • జిన్నా టైటిల్ మార్చాలంటున్న బీజేపీ
టాలీవుడ్ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు 'జిన్నా' అనే చిత్రంలో నటిస్తుండడం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా టైటిల్ పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 'జిన్నా' అనే టైటిల్ తొలగించాలంటూ బీజేపీ పేర్కొంది.

కాగా, ఈ సినిమా టైటిల్ ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడం కూడా బీజేపీని ఆగ్రహానికి గురిచేసింది. జిన్నా ఓ దేశద్రోహి అని, ఆ పేరుతో సినిమా తీయడమేంటని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఇటీవల ప్రశ్నించారు. మంచు విష్ణు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. జిన్నా కారణంగా ఎంతోమంది హిందువులు మానప్రాణాలు కోల్పోయారని, వారి గురించి మంచు విష్ణు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. జిన్నాలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్ర పోషిస్తున్నాడు. గాలి నాగేశ్వరరావు పేరును షార్ట్ కట్ లో 'జిన్నా' అని కుదించి దాన్నే టైటిల్ గా ఫిక్స్ చేశారు.
Go Back to Shorts
Ginna
Manchu Vishnu
New Movie
Title
BJP

More Telugu News