దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 7,584 కరోనా కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న 3,791 మంది
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 36,267
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 8,813 నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 2,193, ఢిల్లీలో 622, కర్ణాటకలో 471, హర్యానాలో 348 కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశంలో రికవరీ రేటు 98.70 శాతంగా, పాజిటివిటీ రేటు 2.26 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,94,76,42,992 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 15.31 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.