తెలంగాణలో తాజాగా 63 మందికి కరోనా
- గత 24 గంటల్లో 8,392 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 47 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 47 మంది
- ఇంకా 563 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 7,93,607 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,933 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 563 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు.
