జ‌ల్ల‌య్య కుటుంబానికి టీడీపీ రూ.25 ల‌క్ష‌ల సాయం

tdp announce 25 lacks to jallaiah family
  • ప్ర‌త్య‌ర్థుల దాడిలో మృతి చెందిన జ‌ల్ల‌య్య‌
  • నిందితుల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌న్న ప్రత్తిపాటి  
  • ప్రభుత్వం త‌ర‌ఫున కూడా సాయం అందించాల‌ని డిమాండ్  
ప‌ల్నాడు జిల్లా జంగ‌మ‌హేశ్వ‌ర‌పాడులో ప్ర‌త్య‌ర్థుల దాడిలో మృతి చెందిన టీడీపీ కార్య‌క‌ర్త జ‌ల్ల‌య్య కుటుంబానికి టీడీపీ భారీ ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించింది. జ‌ల్ల‌య్య కుటుంబానికి పార్టీ త‌ర‌ఫున‌ రూ.25 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందించ‌నున్న‌ట్లు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు ప్ర‌క‌టించారు. 

అదే స‌మ‌యంలో జ‌ల్ల‌య్య‌ను హ‌త్య చేసిన నిందితుల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని ఈ సంద‌ర్భంగా పుల్లారావు డిమాండ్ చేశారు. జ‌ల్ల‌య్య కుటుంబానికి ప్రభుత్వం త‌ర‌ఫున కూడా సాయం అందించాల‌ని ఆయ‌న కోరారు. ఇదిలా ఉంటే పోస్టుమార్టం త‌ర్వాత‌ జ‌ల్ల‌య్య మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించే విష‌యంలో హైడ్రామా నెల‌కొంది. మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు కాకుండా వారి బంధువుల‌కు అప్ప‌గించేందుకు పోలీసులు య‌త్నిస్తున్నార‌న్న దిశ‌గా వార్త‌లు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
TDP
Prattipati Pullarao
Palnadu District

More Telugu News