తెలంగాణలో తాజాగా 49 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 10,940 కరోనా పరీక్షలు
- హైదరాబాదు జిల్లాలో 25 కొత్త కేసులు
- రంగారెడ్డి జిల్లాలో 16 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 50 మంది
- ఇంకా 520 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 7,93,468 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,837 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 520 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
