దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 2,745 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా ఆరుగురి మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,386
ఇక తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,60,832కి పెరిగింది. కరోనా నుంచి 4,26,17,810 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,636 మంది కరోనాకు బలయ్యారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 1,93,57,20,807 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 10,91,110 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.