పేదరికం లేని సమసమాజ నిర్మాణానికి కృషి చేయండి.. సివిల్స్ విజేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు

chandrababu greetings to civil servises winners
  • సోమ‌వారం విడుద‌లైన సివిల్స్-2021 ఫ‌లితాలు
  • స‌త్తా చాటిన తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థులు
  • వారిని అభినందిస్తూ చంద్ర‌బాబు ట్వీట్
యూపీఎస్సీ నిర్వ‌హించిన సివిల్స్‌-2021 ఫ‌లితాలు సోమ‌వారం వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు స‌త్తా చాటారు. మంచి ర్యాంకులూ సాధించారు. వీరికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సోమ‌వారం ఓ ట్వీట్ చేశారు.

అఖిల భార‌త స‌ర్వీసు నియామ‌కాల కోసం యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2021లో ఉభ‌య రాష్ట్రాల‌కు చెందిన యువ‌తీ యువ‌కులు స‌త్తా చాటార‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. పేద‌రికం లేని స‌మాజ నిర్మాణానికి మీరంతా కృషి చేయాల‌ని... తద్వారా తెలుగు వారికి, త‌ల్లిదండ్రుల‌కు మంచి పేరు తీసుకురావాల‌ని ఆయ‌న కోరారు.
Go Back to Shorts
UPSC
Civils-2021
Chandrababu
TDP
Telugu States

More Telugu News