ఒక్క రోజులోనే భారీగా పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 2,628 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 18 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,414
ఇక ప్రస్తుతం దేశంలో 15,414 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.75 శాతంగా, క్రియాశీల రేటు 0.04 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 5.24 లక్షల మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు 192 కోట్లకు పైగా కరోనా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్క రోజే 13.13 లక్షల మంది టీకా వేయించుకున్నారు.