Vijay Devarakonda: షూటింగ్ లో గాయపడ్డ విజయ్ దేవరకొండ, సమంత?

Vijay Devarakonda and Samantha injured in shooting
షార్ట్స్‌లో చూడండి
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. 'మజిలి' సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కశ్మీర్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు శివ తెలిపారు. దాదాపు 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, శరణ్య తదితరులు కీలక పాత్రలను పోషించారు. 

మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది. షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత గాయపడ్డారనేది ఆ వార్త సారాంశం. కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో చిత్రీకరించిన ఒక స్టంట్ సీన్ లో... లిడ్డర్ నదిపై తాడుతో నిర్మించిన వంతెనపై నుంచి వాహనాన్ని నడపాల్సి ఉందట.. ఆ సీన్ చేస్తున్నప్పుడు వాహనం నీటిలో పడటంతో ఇద్దరికీ గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వీరిద్దరికీ చికిత్స అందించారట. అయితే, ఈ ప్రమాదంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. 

మరోవైపు కశ్మీర్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఖుషి' టీమ్ హైదరాబాద్ కు పయనమైంది. జూన్ లో రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 23న ఇది విడుదల కానుంది. రొమాంటిక్ లవ్ స్టోరీ, థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Go Back to Shorts
Vijay Devarakonda
Samantha
Khushi Movie
Injured
Tollywood

More Telugu News