తెలంగాణలో తాజాగా 27 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 12,017 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 17 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 52 మంది
- ఇంకా 372 మందికి చికిత్స
అదే సమయంలో 52 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇక తెలంగాణలో ఇప్పటిదాకా 7,92,898 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,415 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 372 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
