ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో మంత్రి రోజా... ఫొటోలు ఇవిగో!
- టూరిజం మంత్రిగా రోజా విస్తృత పర్యటనలు
- కర్నూలు జిల్లాలోని రాక్ గార్డెన్స్ లో రోజా సందడి
- టూరిస్టు స్పాట్ గా అద్భుతమని వెల్లడి
రాక్ గార్డెన్స్ ప్రాంతం పర్యాటకం పరంగానే కాకుండా, సినిమా షూటింగులకు కూడా ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడ గతంలో జయం మనదేరా, టక్కరిదొంగ, సుభాష్ చంద్రబోస్, బాహుబలి వంటి సినిమాలను చిత్రీకరించారు. ఈ రాక్ గార్డెన్స్ కర్నూలు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే రహదారి పక్కనే ఓర్వకల్లుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఇది కొలువై ఉంది.

