Ayyanna Patrudu: దావోస్ వెళ్తున్నాన‌ని చెప్పి కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ లో జగన్ రెడ్డి లండన్ వెళ్లారు: అయ్య‌న్న పాత్రుడు

jagan went london says Ayyanna Patrudu
  • అది ప్రపంచ టాప్ 50 కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ అన్న అయ్య‌న్న‌
  • దీని ఖర్చు గంటకు రూ.12 లక్షలు అని వ్యాఖ్య‌
  • లండన్ వరకు ఎందుకు వెళ్లారో మరి? అంటూ ట్వీట్
  • చిదంబర రహస్యం ఏంటో? అని ప్ర‌శ్న‌
వ‌రల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ దావోస్ వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న లండ‌న్ వెళ్లార‌ని టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు ఆరోపించారు. అది కూడా అత్యంత ఖర్చు ఉండే విమానంలో వెళ్లార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.  

''జగన్ రెడ్డి దావోస్ అని బయలుదేరిన స్పెషల్ ఫ్లైట్ ఎంబ్రేయర్ లినీయ‌జ్‌ 1000. ప్రపంచ టాప్ 50 కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ ఇది. దీని ఖర్చు, గంటకు 14,500 డాలర్లు. అంటే గంటకు రూ.12 లక్షలు. జగన్ రెడ్డి దావోస్ అని చెప్పి, లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్ట్ లో దిగారని తెలుస్తోంది.  

లండన్ కు దాదాపుగా 13-14 గంటల సమయం. దాదాపుగా కోటిన్నర కేవలం ఫ్లైట్ ఖర్చు. ఇక లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్ట్, కేవలం ప్రైవేట్ ఎయిర్ పోర్ట్. ధనవంతులు మాత్రమే దిగే చోటు. ఇక్కడ పార్కింగ్ ఫీజ్, ప్రపంచ కుబేరులు మాత్రమే భరించగలరు. 

లావిష్ ఫ్లైట్ లో, రాయల్ గా, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి వెళ్తున్నాడు జగన్ రెడ్డి. మన పొట్టలు కొట్టి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక జగన్ రెడ్డి, సీబీఐ కోర్ట్ లో, తాను దావోస్ వెళ్తున్నా అని చెప్పి, లండన్ వరకు ఎందుకు వెళ్లారో మరి? చిదంబర రహస్యం ఏంటో ? మీ ఎంపీ గారు చెప్పింది, నిజమేనా అయితే?'' అని అయ్య‌న్న పాత్రుడు ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు. 

Ayyanna Patrudu
Telugudesam
YSRCP

More Telugu News