భారత్ లో తగ్గుతున్న కరోనా పాజిటివిటీ రేటు.. పూర్తి అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 1,829 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారు 2,549 మంది
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,647
కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో రోజువారీ పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.42 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,91,65,00,770 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 14,97,695 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.