తెలంగాణలో అత్యంత కనిష్ఠ స్థాయిలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 13,930 కరోనా టెస్టులు
- 38 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
- హైదరాబాదులో 27 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 42 మంది
- ఇంకా 370 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,92,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,184 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 370 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
