ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు... అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 1,569 కేసుల నమోదు
- ఇదే సమయంలో కోలుకున్న వారి సంఖ్య 2,467
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,400
మన దేశానికి కరోనా నాలుగో వేవ్ ముప్పు ఉందని కొన్ని రోజుల క్రితం నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. వారు చెప్పినట్టుగానే కేసులు క్రమంగా పెరుగుతూ కొన్ని రోజుల పాటు ప్రతి రోజూ 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కానీ, ఇంతలోనే కొత్త కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం.
మరోవైపు, గత 24 గంటల్లో 2,467 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 16,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,25,84,710 మంది కోలుకున్నారు. మొత్తం 5,24,260 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 191 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.