Thomas Cup: థామ‌స్ క‌ప్ డ‌బుల్స్‌ టైటిల్ మ‌న‌దే!... ఫైన‌ల్లో సాయిరాజ్‌, చిరాగ్ జోడి గెలుపు!

india wins thomas cup double title
షార్ట్స్‌లో చూడండి
థామ‌స్ క‌ప్ టోర్నీలో డ‌బుల్స్ టైటిల్ భార‌త్‌నే వ‌రించింది. ఇప్ప‌టికే ఫైన‌ల్ చేరిన భార‌త జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి టైటిల్ పోరులో స‌త్తా చాటారు. ఇండోనేషియాకు చెందిన అసాన్‌, సంజ‌య జోడిపై విజ‌యం సాధించారు. మూడు సెట్ల పాటు సాగిన టైటిల్ వేట‌లో సాత్విక్‌, చిరాగ్ జోడి 18-21, 23-21, 21-19 తో గెలిచారు. తొలి సెట్‌ను ఓడి డిఫెన్స్‌లో ప‌డిపోయిన‌ట్లుగా క‌నిపించిన సాయిరాజ్‌, చిరాగ్‌ల జోడి ఆ వెంట‌నే జూలు విదిలించింది. తొలి సెట్ త‌ర్వాత రెండు, మూడు సెట్ల‌ను వ‌రుస‌గా నెగ్గింది.

థామ‌స్ క‌ప్ చ‌రిత్ర‌లో తొలి సారి ఫైన‌ల్ చేరిన భారత‌ జోడిగా ఇప్ప‌టికే సాయిరాజ్‌, చిరాగ్‌ల జోడీ రికార్డు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఫైన‌ల్‌లో వీరు పోటీ ప‌డాల్సిన ఇండోనేషియా జ‌ట్టు మాత్రం అప్ప‌టికే 14 టైటిళ్లు గెలిచి య‌మా స్ట్రాంగ్‌గా ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో ఫైన‌ల్‌లో ఏదో అద్భుతం జ‌రిగితే గానీ భార‌త్‌కు టైటిల్ ద‌క్క‌ద‌న్న వాద‌న‌లు వినిపించాయి. అయితే ఈ వాద‌న‌ల‌ను ప‌టాపంచ‌లు చేసిన సాయిరాజ్‌, చిరాగ్ జోడి భార‌త్‌కు థామ‌స్ క‌ప్‌లో తొలి టైటిల్‌ను అందించారు.
Go Back to Shorts
Thomas Cup
India
Chirag Shetty
Satwiksairaj Rankireddy

More Telugu News