రామ్ సినిమాలకి పెరుగుతున్న బడ్జెట్!
- రామ్ తాజా చిత్రంగా రూపొందిన 'ది వారియర్'
- ఆయన కెరియర్లో భారీ బడ్జెట్ సినిమా ఇదే
- తెలుగు .. తమిళ భాషల్లో జులై 14న విడుదల
- రేపు సాయంత్రం 5:31 నిమిషాలకు టీజర్ రిలీజ్
- బోయపాటితో తొలి పాన్ ఇండియా సినిమా చేస్తున్న రామ్
రామ్ సినిమా కోసం ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ఈ సినిమా నుంచి వచ్చిన 'బుల్లెట్' సాంగ్ జనంలోకి బాగానే వెళ్లింది .. భారీ స్థాయిలోనే వ్యూస్ తెచ్చుకుంది. రేపు సాయంత్రం 5:31 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను జులై 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా తరువాత బోయపాటితో రామ్ చేయనున్న సినిమా బడ్జెట్ మరింత పెరిగిందనేది తాజా సమాచారం. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు. రామ్ కెరియర్లో తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.