China: విమానంలో తప్పిన ఘోర ప్రమాదం.. 113 మంది ప్రయాణికులు సేఫ్!

  • చైనాలోని చాంగ్ కింగ్ ఎయిర్ పోర్టులో విమాన ప్రమాదం
  • టేకాఫ్ సమయంలో చెలరేగిన మంటలు
  • ఘటనలో 25 మందికి గాయాలు
Airplane caught fire in China airport

చైనాలోని చాంగ్ కింగ్ ఎయిర్ పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ కు విమానం సిద్ధమైన సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది... ప్రయాణికులను, విమాన సిబ్బందిని అత్యవసర మార్గాల ద్వారా కిందకు దించారు. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి.

More Telugu News