అతనికి వెనకడుగు వేయడం తెలియదు: 'మేజర్' ట్రైలర్ రిలీజ్!

Major movie trailer released
  • మహేశ్ బాబు నిర్మాణంలో రూపొందిన 'మేజర్' 
  • మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివి శేష్ 
  • యథార్థ సంఘటన ఆధారంగా నిర్మితమైన సినిమా
  • జూన్ 3వ తేదీన 3 భాషల్లో సినిమా విడుదల
అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమా రూపొందింది. శశికిరణ్  తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. హీరో మహేశ్ బాబు ఈ సినిమాను తన సొంత బ్యానర్లో నిర్మించాడు. 26/11 ముంబైలోని ఒక హోటల్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మతమైంది. 

తాజాగా ఈ సినిమా నుంచి  ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంతో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎక్కువగా ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ డైలాగ్స్ నేపథ్యంలోనే ఎక్కువ విజువల్స్ పడ్డాయి. 

'ఒక కొడుకుగా .. ఒక భర్తగా ఉండటం కన్నా ఒక సోల్జర్ గా ఉండటం ముఖ్యం' .. 'వాడిక వెనకడుకు వేయడు .. తప్పించుకునే  ఆలోచన చేయడు' వంటి డైలాగ్స్ ఉద్వేగాన్ని కలిగిస్తాయి. హీరో సరసన నాయికగా సయీ మంజ్రేకర్ అలరించనుండగా, ముఖ్యమైన పాత్రల్లో రేవతి .. శోభిత ధూళిపాళ .. మురళీశర్మ కనిపించనున్నారు. తెలుగు . తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను జూన్ 3వ తేదీన విడుదల చేయనున్నారు
Go Back to Shorts
Adivi Sesh
Saiee Manjrekar
Shobhitha Dhulipala
Major Movoe

More Telugu News