ఏపీ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ నా పొలాన్ని ఆక్ర‌మించారు: ప్ర‌కాశం జిల్లా క‌లెక్ట‌ర్‌కు మ‌హిళ ఫిర్యాదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ నా పొలాన్ని ఆక్ర‌మించారు: ప్ర‌కాశం జిల్లా క‌లెక్ట‌ర్‌కు మ‌హిళ ఫిర్యాదు

land grab complaint on ap minister adimulapu suresh
  • స్పంద‌న కార్యక్రమంలో ఫిర్యాదు
  • సురేశ్‌పై ద‌రిమ‌డుగుకు చెందిన రంగ‌లక్ష్మ‌మ్మ ఫిర్యాదు
  • త‌న‌కు పుట్టింటి వారు ఇచ్చిన పొలాన్ని సురేశ్ లాక్కున్నార‌న్న మ‌హిళ‌
ఏపీ మునిసిప‌ల్ శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ త‌న భూమిని ఆక్ర‌మించారంటూ ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఓ మ‌హిళ నేరుగా జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. సురేశ్ నుంచి త‌న పొలాన్ని విడిపించాలంటూ ఎంత‌మందికి ఫిర్యాదు చేసినా త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న బాధిత మ‌హిళ‌.. త‌మ‌రైనా న్యాయం చేయాలంటూ క‌లెక్ట‌ర్‌ను వేడుకుంది. 

ప్ర‌కాశం జిల్లా కేంద్రం ఒంగోలులో సోమ‌వారం స్పంద‌న కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లా కలెక్ట‌ర్ ప్ర‌జా ఫిర్యాదుల‌ను స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి జిల్లాలోని ద‌రిమ‌డుగు గ్రామానికి చెందిన రంగ‌ల‌క్ష్మ‌మ్మ కూడా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమె నేరుగా క‌లెక్ట‌ర్‌కు త‌న స‌మ‌స్య‌ను విన్న‌వించుకున్నారు. త‌న‌కు ప‌సుపు కుంకుమ కింద త‌న పుట్టింటి వారు ఇచ్చిన పొలాన్ని మంత్రి సురేశ్ ఆక్ర‌మించార‌ని, దానిని సురేశ్ నుంచి విడిపించి త‌న‌కు అప్ప‌గించాల‌ని ఆమె క‌లెక్ట‌ర్‌ను కోరారు.
AP Minister
Adimulapu Suresh
Prakasam District

More Telugu News