'జయమ్మ పంచాయతి' షూటింగ్ లో కాలు జారి పడ్డ సుమ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో ఇదిగో!

'జయమ్మ పంచాయతి' షూటింగ్ లో కాలు జారి పడ్డ సుమ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో ఇదిగో!

Anchor Suma narrowly escapes accident during Jayamma Panchayathi shooting
  • ఎలాంటి గాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న చిత్ర యూనిట్
  • నిన్న విడుదలైన 'జయమ్మ పంచాయతి'
  • ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న చిత్రం
ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ 'జయమ్మ పంచాయతి' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ చిత్రం ఆకట్టుకుంది. మరోవైపు ఈ షూటింగ్ సందర్భంలో సుమ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిన్న నీటి ప్రవాహం ఉన్న రాతిపై నిల్చున్న ఆమె కాలు జారి కింద పడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఆమెకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Suma
Tollywood
Fell

More Telugu News