Suma: సుమ యాంకరింగ్ ను వదిలేస్తుందా?.. ఇదీ ఆమె చెప్పిన సమాధానం!

Will Suma Stop Anchoring Her Answer Is This
షార్ట్స్‌లో చూడండి
బుల్లి తెర మీద మాటల గారడీ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సుమ. ఇప్పుడు వెండితెరపై ఆ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ‘పంచాయితీ’ పెట్టేసుకుంటోంది. ఆమె ప్రధానపాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ సినిమా ఇవాళ విడుదలైంది. విజయ్ కుమార్ కాలివరపు తెరకెక్కించిన ఈ సినిమాను వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బలగ ప్రకాశ్ నిర్మించాడు. ఎం.ఎం. కీరవాణీ బాణీలు సమకూర్చాడు. 

ఇవాళ సినిమా విడుదల నేపథ్యంలో ఓ చానెల్.. ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఈ సినిమా తర్వాత సుమ బుల్లితెరకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందా? యాంకరింగ్ ను వదిలేస్తుందా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చింది. బుల్లితెరను వదిలే చాన్సే లేదని తేల్చి చెప్పింది. ఇటు బుల్లితెరపై మెరుస్తూనే సినిమాల్లోనూ నటిస్తానని తెలిపింది. 

తనకు అన్నం పెట్టింది బుల్లితెర అని, తల్లి లాంటిదని పేర్కొంది. తల్లిని వదిలేసి ఎలా వెళ్తామని, వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తాను టీవీల్లో చేస్తూ సినిమాలకు వెళ్తున్నాను కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నారని, కానీ, చాలా మంది సినిమాలు చేస్తూ టీవీలోకి వస్తున్నారని చెప్పింది. ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు వస్తాయని తాను అనుకుంటున్నట్టు చెప్పింది. ఇండస్ట్రీ కూడా దాని కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని పేర్కొంది. 

Go Back to Shorts
Suma
Tollywood
Small Screen
Jayamma Panchayithi

More Telugu News