Samantha: ఆసక్తిని రేపుతున్న 'యశోద' ఫస్టు గ్లింప్స్!

Yashoda Movie First  Glimpse Released
షార్ట్స్‌లో చూడండి
సమంత ప్రధాన పాత్రగా 'యశోద' సినిమా రూపొందుతోంది. ఇది సస్పెన్స్ తో కూడుకున్న సైకలాజికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. శ్రీదేవి మూవీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి హరి - హరీశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బ్యానర్ పై వచ్చిన అనేక సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.    

అలాంటి ఈ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఈ ఫస్టు వీడియోలో ఎలాంటి డైలాగ్స్ లేవు. అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన సమంత తనని తాను కొత్తగా చూసుకోవడం .. కిటికీ దగ్గరికి వెళ్లి బయట వాలిన పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడాన్ని చూపించారు. 

మణిశర్మ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించాడు. ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పైనే ఈ ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. ఇది  సినిమాపై ఆసక్తిని పెంచేదిలానే  ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. మురళీ శర్మ .. ఉన్ని ముకుందన్ ముఖ్యమైన  పాత్రల్లో కనిపించనున్నారు. 
Go Back to Shorts
Samantha
Varalakshmi Sharathkumar
Yashoda Movie

More Telugu News