Ram Gopal Varma: ప్రశాంత్ నీల్ పై ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma praises Prashanth Neel
షార్ట్స్‌లో చూడండి
కన్నడ స్టార్ హీరో యశ్ తో 'కేజీఎఫ్2'ను తెరకెక్కించి పాన్ ఇండియా లెవెల్లో ఘన విజయాన్ని సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ పై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. 'మీరు ఇండియన్ సినిమా వీరప్పన్' అని కొనియాడారు. 

దర్శకుల దినోత్సవం సందర్భంగా ప్రశాంత్ నీల్ కు శుభాకాంక్షలు తెలిపిన వర్మ... 'కేజీఎఫ్2' సినిమాతో కన్నడతో పాటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులకు కనువిప్పు కలిగించారని చెప్పారు. రీ షూటింగులు, రీ డ్రాఫ్టులు, పునరాలోచనలతో టన్నుల కొద్దీ డబ్బును వృథా చేస్తున్నారని... వాళ్లు వేస్ట్ చేస్తున్నంత డబ్బుతోనే మీరు క్వింటాల్ డబ్బు సంపాదించారని ప్రశంసించారు. 

సినీ పరిశ్రమలో సంప్రదాయబద్ధంగా ఉండే 95 శాతం మందికి 'కేజీఎఫ్ 2' నచ్చలేదని చెప్పారు. మీరు పాత ఇండస్ట్రీని బయటకు నెట్టేసి, కొత్త పరిశ్రమకు జీవం పోశారని.. దాని పేరే 'కేజీఎఫ్ 2' అని ప్రశంసించారు.
Go Back to Shorts
Ram Gopal Varma
Prashanth Neel
KGF 2
Tollywood
Sandalwood

More Telugu News