Prabhas: ' ప్రాజెక్టు K' షూటింగులో ప్రభాస్!

  • ప్రభాస్ కెరియర్లోనే భారీ ప్రాజెక్టుగా 'ప్రాజెక్టు K'
  • టైమ్ మిషన్ నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది 
  • హైదరాబాదులో జరుగుతున్న షూటింగు 
  • ప్రభాస్ .. దీపిక .. అమితాబ్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ
Project K movie update

ప్రభాస్ కథానాయకుడిగా 'ప్రాజెక్టు K' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగును జరుపుకుంది. ఇది పాన్ వరల్డ్ సినిమా అని నాగ్ అశ్విన్ చెప్పడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఈ సినిమా కోసం తోట తరణి పర్యవేక్షణలో హైదరాబాదులో మూడు భారీ సెట్లు వేశారు. ఈ కథ మొత్తానికి ఈ మూడు సెట్స్ చాలా కీలకం. ఈ మూడు సెట్స్ లోనే మేజర్ పార్టు షూటింగును జరపనున్నారు. ప్రస్తుతం ఈ సెట్స్ లోనే చిత్రీకరణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజా షెడ్యూల్లో ప్రభాస్  .. అమితాబ్ .. దీపిక పాల్గొంటున్నారు. 

ఇక మరో బాలీవుడ్ ఆర్టిస్ట్ కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ల కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇది టైమ్ మిషన్ నేపథ్యంలో సాగే కథ అని అంటున్నారు. ఈ సినిమాలో అమితాబ్ సైంటిస్ట్ గా కనిపించనుండగా, ఆయన కూతురు పాత్రను దీపిక పోషిస్తోంది. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ నడుస్తుందని అంటున్నారు.

More Telugu News