సినీ పరిశ్రమలో ఇలాంటి వదంతులు సాధారణమే.. సెలబ్రిటీలు అన్న తర్వాత తప్పదు: యాంకర్ సుమ
- రాజీవ్ తో పెళ్లయి 23 ఏళ్లు అవుతోందన్న సుమ
- చాలా సంతోషంగా ఉన్నామని వ్యాఖ్య
- తమపై వదంతులు వచ్చినప్పుడు కొన్ని ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తానన్న యాంకర్
- వాటి ద్వారా ఆ వదంతులకు కొంతవరకైనా చెక్ పెట్టే ప్రయత్నం చేశానని వివరణ
తమపై వదంతులు వచ్చినప్పుడు తాను తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తానని తెలిపింది. వాటి ద్వారా ఆ వదంతులకు కొంతవరకైనా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తానని వివరించింది. సినీ పరిశ్రమలో ఇలాంటి వదంతులు సాధారణమేనని, సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటివి తప్పదని వ్యాఖ్యానించింది.
అటువంటి వాటి వల్ల మానసికంగా బాధ కలిగినా అందుకు అలవాటుపడి పోయామని తెలిపింది. కాగా, రాజీవ్‌తో సుమకు విభేదాలు వచ్చిన కారణంగా వారు, వేర్వేరుగా ఉంటున్నారని, విడాకులు కూడా తీసుకోవాలనుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి.