యువ‌తి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకున్న యువ‌కుడు.. మృతి

youngster dies
  • ప్రేమ విఫ‌ల‌మైందని మ‌న‌స్తాపం
  • పెద్ద‌ప‌ల్లి జిల్లా గుంజ‌ప‌డుగులో ఘ‌ట‌న‌
  • మృతుడి స్వ‌స్థ‌లం వ‌రంగ‌ల్ జిల్లా పాప‌య్య‌పేట
ప్రేమ విఫ‌ల‌మైంద‌న్న కార‌ణంతో యువ‌తి ఇంటిముందు ఓ యువ‌కుడు శ‌ర‌రీంపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని మండ‌లం గుంజ‌ప‌డుగులో చోటు చేసుకుంది. ఆ గ్రామంలోని త‌న ప్రేయ‌సి ఇంటిముందుకు పెట్రోలుతో వెళ్లిన యువ‌కుడు నిప్పు అంటించుకోవ‌డం చూసిన స్థానికులు మంట‌లు ఆర్పి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. 

ఆ యువ‌కుడిని చికిత్స కోసం క‌రీంన‌గ‌ర్  ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి స్వ‌స్థ‌లం వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లం పాప‌య్య‌పేట అని పోలీసులు గుర్తించారు.
Go Back to Shorts
Crime News
Peddapalli District
Warangal Rural District

More Telugu News